చిన్న గ్యాప్ కోసమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ సరస్వతి ఫిలింస్ పతాకంపై నాగ అనే్వష్, హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఏంజెల్’. సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కిన ఈ సినిమాకి రాజవౌళి శిష్యుడు బాహుబలి పళని దర్శకుడు. నిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి. ఈ చిత్రం ఈనెల 3న విడుదలవుతున్న సందర్భంగా కథానాయిక హెబ్బా పటేల్ చెప్పిన విశేషాలు.. ‘‘ ఏంజెల్ సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్ స్టోరీ, గ్రీన్ మ్యాట్‌లో చేసిన షూట్‌ను నేను బాగా ఎంజాయ్ చేసి నటించాను. 45 నిముషాలకుపైగా సిజీ సీన్స్ వుండడంతో దాదాపు నాలుగు నెలలు కష్టపడి పనిచేసారు సినిమా యూనిట్, కుమారి 21ఎఫ్ తరువాత మరోసారి ఏంజిల్ టైటిల్ రోల్‌లో నటిస్తున్నందుకు హ్యాపీగా వున్నాను, ఈ చిత్రంలో నా పాత్ర ఏంజిల్. అందరూ అలానే పిలుస్తుంటారు, దివినుంచి దిగివచ్చిన నాకు హీరోకు, సప్తగిరికి మధ్య పరిచయం ఎలా అవుతుంది ? దివినుంచి ఎలా వచ్చాను అ తర్వాత ఏం జరిగింది అనేది చిత్ర కధాంశం. ఈ కథ ఎంచుకోవడానికి సినిమా కంటే ముఖ్య కారణం స్టోరీ లైన్ బాగా నచ్చింది. డైరక్టర్ పలణిగారు అద్భుతంగా కథను నారేట్ చేయడమే కాకుండా గ్రాఫిక్స్ కూడా అంతే అద్భుతంగా ప్రెజెంట్ చేసారు. నా పాత్రలో చాలా వేరియేషన్స్ కనిపిస్తాయి. హీరో అనే్వష్ కొత్త అయినా చాలా హార్డ్‌వర్కర్. డాన్స్, ఫైట్స్, యాక్టింగ్ చాలా బాగా చేసారు. మంచి హీరో అవడానికి ఆస్కారమున్న వ్యక్తి. తప్పకుండా బిగ్ హీరో అవుతాడు అనే్వష్. ఇక నా విషయానికి వస్తే ఒకటిన్నర సంవత్సరం నుంచి వరస సినిమాలతో షూటింగ్స్‌తో బిజీగా గడిపాను. కొంత కాలం గ్యాప్ తీసుకోవాలని అనుకుంటున్నాను. సినిమా బిజీలో పడి నా గురించి నేను పట్టించుకోవడం మానేశా. అందుకే రెస్ట్ కావాలి అనుకుంటున్నాను. చిన్న గ్యాప్ కోసమే ప్రస్తుతానికి ఏ సినిమాను అంగీకరించడం లేదు అని అన్నారు హెబ్బా...