కానె్సప్ట్ సినిమాలే చేస్తా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆది సాయికుమార్, వైభవి, రష్మీ, బ్రహ్మాజీ ప్రధాన తారాగణంగా పి.ప్రభాకర్ దర్శకత్వంలో వి4 మూవీస్ పతాకంపై రూపొందించిన హారర్ ఎంటర్‌టైనర్ ‘నెక్స్ట్ నువ్వే’. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడిన నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హీరో ఆది సాయికుమార్ సినిమా విశేషాలు తెలిపారు.
* ప్రాజెక్టు ఎలా కుదిరింది?
- దర్శకుడు ప్రభాకర్ కలిసి 20 నిముషాల పాటు ఈ కథ ప్రధాన సూత్రాన్ని చెప్పారు. అప్పుడే నచ్చింది. ఇది గీతా ఆర్ట్స్ నిర్మించనున్న సినిమా అని చెప్పగానే ఉత్సాహం వచ్చింది. ఇంత పెద్ద నిర్మాణ సంస్థలో సినిమా చేయడం ఓ గొప్ప అనుభవంగా భావించా.
* దర్శకుడు గురించి..
- ఆయన ముందే అనుభవం వుండడంవల్ల సులభంగానే చేసారు. కేవలం సింగిల్ షెడ్యూల్‌లో 37 రోజుల్లోషూటింగ్ పూర్తి చేసారు. ఆయన కథ చెప్పిన విధానం చూసినపుడే సినిమా చక్కగా చేయగలరన్న నమ్మకం కుదిరింది. ఎలాంటి టెన్షన్ లేకుండా చేసారు.
* మొదటి హారర్ జోనర్ కదా?
- అవును. నేను ఫలానా జోనర్‌లో సినిమాలే చేయాలని రూల్ ఏం పెట్టుకోలేదు. మంచి నటుడుగా ఎదగాలనేదే కోరిక. మంచి కథలు ఎలాంటివైనా చేస్తా. ఈ సినిమాలో స్క్రీన్‌ప్లే బాగా నచ్చింది. హారర్‌తోపాటు కామెడీ కూడా వుంటుంది. అదే నాకు ఎక్కువ ఉత్సాహం ఇచ్చింది.
* రీమేక్ అని తెలుసా?
- తెలుసు. దీని ఒరిజినల్ వెర్షన్ ‘యామి రుక్క భయమే’. అందులోనుండి కథను మాత్రమే తీసుకున్నారు. తెలుగులో అనేక మార్పులు చేసారు. ఒరిజినల్ సినిమా కూడా నేను చూసా.
* మల్టీ స్టారర్ చేస్తారా?
- తప్పకుండా. మంచి కథలు వస్తే చేయడానికి సిద్ధం. రెగ్యులర్ సినిమాలు కాకుండా కొత్త కానె్సప్ట్ బేస్డ్ కథలను చేయాలనుకుంటున్నా. అలాగే కొత్త దర్శకులతో కూడా పని చేయాలని ఉంది.
* హారర్ చిత్రాలు ఇష్టమా?
- బాగా చూస్తా. మొదటిసారి వర్మ తీసిన భూత్ సినిమా మూడు నాలుగు సార్లు చూసాను. ఇప్పటికీ ఆ చిత్రంలో కొన్ని సన్నివేశాలు మరిచిపోలేను.
* నెక్స్ట్ ప్రాజెక్టులు?
- స్టుడియో గ్రీన్‌తో మూడు సినిమాలు ఒప్పుకున్నా. వాటిలో రెండు బై లింగ్విల్ కాగా మరోటి స్ట్రయిట్ తెలుగు చిత్రం. వీటితోపాటు మరో తెలుగు సినిమాలో ప్రస్తుతం నటిస్తున్నా.

- శ్రీ