లవర్ ఆఫ్ ఇడియట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవీన్ చందర్, నివేదా థామస్ జంటగా నటిస్తున్న చిత్రం ‘జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్’. కొత్తపల్లి అనూరాధ సమర్పణలో అనురాగ్ ప్రొడక్షన్స్ పతాకంపై కొత్తపల్లి ఆర్.రఘుబాబు, కె.బి. చౌదరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అజయ్ వోధిరాల దర్శకుడు. రతీస్ వేగ మ్యూజిక్ దర్శకత్వంలో రూపొందిన పాటల విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సుకుమార్ సీడీని విడుదల చేసారు. ఈ సందర్భంగా నవీన్ చంద్ర మాట్లాడుతూ మా డైరెక్టర్ అజయ్ చాలా మొండోడు. షాట్ బాగా వచ్చే వరకు వదలడు. నిర్మాత సినిమా అంటే ఫ్యాషన్‌తో పని చేసారు. రతీవ్‌వేగ అద్భుతమైన పాటలను అందించారు. చిత్రం కూడా తప్పకుండా అందరికీ నచ్చుతుంది. నివేదాతో వర్క్ చేయడం ఆనందంగా వుంది అన్నారు. దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ అజయ్ వోధిరాల ప్రతి విషయాన్ని క్వాలిటీగా వుండాలని అనుకుంటాడు. కథ విషయంలో ఎంతోటైమ్ తీసుకుని మంచి కథతో చేసిన సినిమా ఇది. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. నవీన్ చంద్ర మంచి పెర్మార్మర్, మంచి మనసున్న వ్యక్తి, తనకు మంచి భవిష్యత్తు వుంటుంది. రఘుబాబు ఎక్కడా కంప్రమైజ్ కాకుండా చేసిన సినిమా ఇది. ఇలాంటి సినిమాలు హిట్ అయితేనే ఇండస్ట్రీ బాగుంటుంది అన్నారు.