వర్మ దర్శకత్వంలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినిమా కాన్వాస్‌పై రాంగోపాల్‌వర్మ నాగార్జునల సినిమా శివ ఒక చెరగని సంతకం చేసింది. శివ విడుదలై 28 ఏళ్లు అవుతున్నా, ఇప్పటికీ ఆ సినిమా కొత్త దర్శకులకు ఒక నిఘంటువు వంటిది. అలాంటి క్రేజీ కాంబినేషన్ మళ్లీ ఇన్లాళ్ల తర్వాత రిపీటవ్వనుంది. రాంగోపాల్‌వర్మ ఓ అద్భుతమైన కథ చెప్పాడని త్వరలోనే సెట్స్‌కు వెళ్లనుందని నాగార్జున స్వయంగా ఇటీవల రాజుగారి గది 2 ప్రమోషన్స్‌లో భాగంగా చెప్పిన విషయం తెలిసిందే. రాంగోపాల్‌వర్మ స్వయంగా నిర్మించనున్న ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రంరెగ్యులర్ షూటింగ్ ఈనెల 20నుంచి మొదలవ్వనుంది. శివ సినిమా మొదటి షాట్‌ను షూట్ చేసిన అన్నపూర్ణ స్టుడియోస్‌లోనే తాజా చిత్రాన్ని కూడా ప్రారంభించనున్నారు. రాంగోపాల్ వర్మ కంపెనీ బ్యానర్‌లో ఈ క్రేజీ మూవీని ప్రొడ్యూస్ చేయనున్నారు. ఏప్రిల్‌లో చిత్రీకరణ పూర్తి చేసుకోనున్న ఈ మూవీ రిలీజ్ డేట్, టైటిల్, ఇతర వివరాలు త్వరలోనే వర్మ వెల్లడించనున్నారు.