పడిపోయా నీ మాయలో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీరాజన్న మూవీస్, మహేశ్ ఎంటర్‌టైన్‌మెట్స్ పతాకాలపై రూపొందుతున్న లవ్ ఎంటర్‌టైనర్ ‘పడిపోయా నీ మాలో..’ అరుణ్‌గుప్తా, సావేరి, జయవర్ధన్ తారాగణంగా నటించారు. ఆర్.కె.కాంపల్లి దర్శకుడు. మహేశ్ పైడ, భరత్ అంకతి నిర్మాతలు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ టీజర్ లాంచ్ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాతలు మహేశ్ పైడ, భరత్ అంకతి మాట్లాడుతూ దర్శకుడు ఆర్.కె. చెప్పిన కథ బాగా నచ్చింది. ఆయన చెప్పిన తీరు బాగా నచ్చడంతో సినిమా చేయడానికి ముందుకు వచ్చాం. ఆర్‌కె టాలెంట్‌ను నేను గమనించా. సినిమా పూర్తయింది. రెండుగంటల ఆరు నిముషాలపాటు వుంటుంది. వరంగల్, ఖమ్మం, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేసిన ఈ చిత్రంలో అరుణ్, సావేరి బాగా నటించారు. ఫణి, రాధాకృష్ణన్, మల్లికార్జున సినిమాకు పూర్తి సపోర్టు ఇచ్చారు అని తెలిపారు. మేము ముందుగా అనుకున్న టైటిల్‌వేరు, కానీ కథానుగుణంగా పేరయితే బాగుంటుందని భావించి ‘పడిపోయా నీ మాయలో’ అనే పేరును ఖరారు చేసాం అని దర్శకుడు ఆర్‌కె.కాంపల్లి తెలిపారు. నేను చెప్పిన సింగిల్ లైన్ నచ్చి నిర్మాత సినిమా తీయడానికి ముందుకు వచ్చారు. మహేశ్ జత కలిసారు. పూరీ జగన్నాథ్ అంటే వుండేపిచ్చితో అదే దృష్టితో ఈ సినిమాను డిజైన్ చేసుకున్నాం. ఆయనలా సినిమా తీయాలనేది నా కల. ఇదే సంస్థకు రెండో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాను. అందరూ మెచ్చుకునేలా రూపొందిన ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.