సినిమాకు బడ్జెట్‌తో పనిలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గరుడ వేగ’. పూజాకుమార్ హీరోయిన్. ఇప్పటికే ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ సినిమా ఈ నెల 3న విడుదవుతున్న సందర్భంగా దర్శకుడు ప్రవీణ్ సత్తారు చెప్పిన విశేషాలు
అలా మొదలైంది..
నేను ఎక్కువగా బాలీవుడ్ సినిమాల నుండి ప్రేరణ పొందుతాను. ఈ ‘గరుడవేగ’ సినిమా స్క్రిప్ట్ 2006లో రాసుకున్నాను. మొదట ఈ సినిమాకు మగాడు అనే టైటిల్ పెడదాం అనుకున్నాను. చాలా డిస్కషన్ తర్వాత ‘గరుడవేగ’గా టైటిల్ నిర్ణయించాం. మొదట కథ రాసుకున్నప్పుడు ఈ సినిమాలో హీరో సిఐ, కానీ ఇప్పుడు వున్న పరిస్థితులకు అనుగుణంగా హీరో క్యారెక్టర్ మార్చాల్సి వచ్చింది. ఇప్పుడు మా హీరో నేషనల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీలో వర్క్ చేస్తాడు. యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించడం థ్రిల్లింగ్‌గా వుంది. మరిన్ని యాక్షన్ సినిమాలు తీయాలనుకుంటున్నాను.
భారీ బడ్జెట్
అందరు ఇదే ప్రశ్న అడుగుతున్నారు. రాజశేఖర్‌తో ఇంత భారీ సినిమా తీయడం ఎందుకు అని. అది అర్ధం కావడంలేదు. అర్జున్‌రెడ్డి సినిమా 4 కోట్లతో తీసారు. అదీ కొత్త దర్శకుడితో కానీ సినిమా 30 కోట్లు వసూలు చేసింది. బడ్జెట్‌కి సినిమా ఫలితానికి సంబంధం లేదు. నేను బడ్జెట్‌ను అస్సలు పట్టించుకోను. కథను నమ్మి సినిమాను ప్రారంభిస్తాను. కథకు కావాల్సినవన్నీ వున్నాయా.. లేదా? చూసుకుంటాను. సినిమా బాగా రావడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను.
కంబ్యాక్ సినిమా
ఇప్పుడు రాజశేఖర్ పరాజయాల్లో వుండొచ్చు. కానీ ఆయనలో ఫైర్ తగ్గలేదు. ఈ కథకు ఆయన అయితేనే కరెక్ట్ అని భావించే ఈ కథను ఆయనకు చెప్పాను. తప్పకుండా ఆయనకు కంబ్యాక్ సినిమా అవుతుంది. అలాగే సన్నీలియోన్. సినిమాలో అదనపు ఆకర్షణ కోసం సన్నీలియోన్‌ను సంప్రదించడం జరిగింది. ఆమెపాటకు మంచి ఆదరణ లభిస్తుంది.