రంగస్థలం డేట్ మారిందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరోయిన్‌గా సమంత నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నఈ సినిమాలో పూజా హెగ్డే ప్రత్యేక పాటలో అలరించనుంది. దేవీశ్రీ ప్రసాద్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అనసూయ, జగపతిబాబు, ఆది పినిశెట్టిలు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వేసిన ఒక విలేజ్ సెట్‌లో జరుగుతుంది. ఈ క్రమంలోనే ఆ గ్రామసెట్ ఫొటోలు ఈ మధ్య సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. మొదట ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావచ్చని అనుకున్నారు. కానీ అనివార్య కారణాలవల్ల సినిమా వాయిదా పడిందట. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. అన్నీ కుదిరితే మార్చి 29న రంగస్థలం థియేటర్స్‌లో సందడి చేయనుంది. ఈ విషయంపై త్వరలోనే అధికారిక వివరాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి.