ఆ హీరోకి నో చెప్పిందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల చందమామ కాజల్‌కు ఈ మధ్య వరుస పరాజయాలు టెన్షన్ పెడుతున్నాయి. అటు తమిళంలో కూడా పరిస్థితి ఇలాగే ఉండడంతో కొత్త అవకాశాలు రావడం లేదు. మళ్లీ తన క్రేజ్‌ను పెంచుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్న కాజల్ తాజాగా ఓ యువహీరో చిత్రానికి నో చెప్పడం ఆసక్తిని కలిగిస్తోంది. దానికి కారణాలు ఏవైనప్పటికీ కుర్ర హీరోలతో సినిమా చేస్తే వరుసగా అలాంటి అవకాశాలే వస్తాయని భావించిందో ఏమో. అందుకనే నో చెప్పిందట. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా? ప్రస్తుతం టాలీవుడ్‌లో భిన్నమైన సినిమాలతో వరుస విజయాలు అందుకుంటున్న శర్వానంద్. సుధీర్‌వర్మ దర్శకత్వంలో శర్వానంద్ నటించే ఈ చిత్రం కోసం హీరోయిన్‌గా కాజల్‌ను నటింపజేయాలని అనుకున్నారట. కానీ, ఆమె నో చెప్పిందని టాక్. దాంతో ఇప్పుడు మరో క్రేజీ హీరోయిన్ కోసం అనే్వషిస్తున్నారు.