నిరూప్ ‘రాజరథం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాలిహిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిరూప్ భండారి హీరోగా అనూప్ భండారి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘రాజరథం’ అజయ్‌రెడ్డి గొల్లపల్లి రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన కథానాయకుడి పోస్టర్ ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రంలో నిరూప్ కాలేజీ స్టూడెంట్‌గా నటిస్తున్నాడని, గతంలో బాలనటుడిగా జాలీజాలీ పిక్‌నిక్ అనే సీరియల్‌లో నటించారని తెలిపారు. తడి నేలపై డ్యాన్స్ చేయడంతో యాక్షన్స్ సిక్వెన్స్‌లో డూప్‌లేకుండా నటించడంతో షూటింగ్‌లో గాయాలపాలయ్యాడని తెలిపారు. అవంతికశెట్టి, రాధికా పండిట్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నదని ఆయన అన్నారు. ఆర్యా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, పాటలు: రామజోగయ్యశాస్ర్తీ, దర్శకత్వం: అనూమ్ భండారి.