యూరప్‌లో పవన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ యూరప్‌లో జరుపుకుంటోంది. ఇప్పటికే అరవై శాతం పైగా షూటింగ్‌ని హైదరాబాద్‌లో పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఓ కీలక సన్నివేశాల కోసం యూరప్ వెళ్లింది. అక్కడే రెండు పాటలతో పాటు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారట. పవన్- త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా మొదలై చాలా రోజులు అవుతున్నా కూడా ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఇప్పటికే అజ్ఞాతవాసి, బాటసారి లాంటి టైటిల్స్ ప్రచారంలో వున్నాయి. కీర్తి సురేష్, అనూ ఇమ్మానుయెల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ఈనెల 7న త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేస్తారంటూ ప్రచారం జరిగింది. కానీ ఆ రోజున ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయడం లేదని యూనిట్ తెలిపింది. హారికా హాసిని బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 10న విడుదల కానుంది.