ఖాకీ పాటలు వచ్చేశాయ్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్తి, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ప్రొడక్షన్స్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై వినోద్ దర్శకత్వంలో ఎస్.ఆర్. ప్రభు, ఎస్.ఆర్.ప్రకాష్ రూపొందించిన చిత్రం ‘ఖాకి’. తమిళంలో ధీరమ్ అధిగారమ్ ఒండ్రు చిత్రాన్ని తెలుగులో ఉమేష్‌గుప్తా, సుభాష్ గుప్తా అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లకు, టీజర్లకు మంచి స్పందన లభిస్తోందని నిర్మాతలు తెలియజేశారు. కార్యక్రమంలో జీబ్రాన్ అందించిన ఆడియో విడుదల కార్యక్రమంలో నిర్మాత దిల్‌రాజు ఆడియో సీడీని విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ- పోలీస్ కథలతో అనేక చిత్రాలు వచ్చాయని, ఎప్పటికప్పుడు ఆయా పాత్రలు హీరోలకు ఛాలెంజింగ్‌గా వుంటాయని, కార్తి నటన, జీబ్రాన్ సంగీతం సినిమాకు హైలెట్‌గా ఉన్నాయని తెలిపారు. నాలుగు పాటలు హంటింగ్‌గా ఉంటాయని, నవంబర్ 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఆయన అన్నారు. నిర్మాతలు సినిమాను అద్భుతంగా ప్రమోట్ చేస్తున్నారని, తన కెరీర్‌లో ఈ చిత్రం డిఫరెంట్‌గా నిలుస్తుందని, వినోద్ చెప్పిన స్క్రిప్ట్ విని నచ్చి, నటించానని నటుడు కార్తి తెలిపారు.
ఈ సినిమా కోసం దాదాపు చాలామంది పోలీసు అధికారులను కలిశానని, 1945 నుండి 2005 వరకు జరిగిన పది సంవత్సరాల యథార్థగాధను దర్శకుడు చక్కగా రూపొందించారని, గతంలో వచ్చిన పోలీస్ మార్క్ చిత్రాలకు డిఫరెంట్‌గా సాగుతుందని ఆయన అన్నారు. ఈ చిత్రం తనకు స్పెషల్ అని, రియల్ కథనాలతో రూపొందించిన ఈ చిత్రంలో తన పాత్ర కొత్తగా వుంటుందని కథానాయిక రకుల్‌ప్రీత్‌సింగ్ అన్నారు. కార్యక్రమంలో లగడపాటి శ్రీ్ధర్, కె.అచ్చిరెడ్డి, ఎస్.వి.కృష్ణారెడ్డి, ఎన్.శంకర్ తదితరులు పాల్గొని విశేషాలు తెలిపారు.