1న జవాన్ వస్తున్నాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయిధరమ్ తేజ్, మెహరీన్ ఫిర్జాదా జంటగా రవి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘జవాన్’. నిర్మాత రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాట విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు రవి మాట్లాడుతూ- నన్ను గైడ్ చేసిన వ్యక్తి దిల్‌రాజు మాత్రమే. తమన్ ఈ సినిమాకు చాలా కష్టపడ్డాడు. ప్రత్యేకమైన శ్రద్ధతో మ్యూజిక్ ఇచ్చాడు. గుహన్ అద్భుతమైన విజువల్స్ అందించారు. కృష్ణ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు. తేజు కథ వినగానే మీరు డైరెక్ట్ చేయండి, నేను సినిమా చేస్తాను అన్నారు. సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ- దిల్‌రాజు, కృష్ణ సినిమాకు ఏది అవసరమో దాన్ని యూనిట్‌కి సకాలంలో అందించి ఓ మంచి సినిమా చేయడంలో అందరినీ ముందుకు నడిపారు. తమన్‌తో నేను కలిసి చేస్తోన్న సినిమా ఇది. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం అన్నారు. దిల్‌రాజు మాట్లాడుతూ- ‘‘నాకు నిర్మాత కృష్ణతో ఇడియెట్ సినిమా నుండి పరిచయం ఉంది. తన కోసం ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. సినిమా విషయానికి వస్తే, జవాన్ అనగానే ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన కుర్రాడు తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి ఏం చేశాడనేదే కథ. గుడ్ లవ్ అండ్ ఎంటర్‌టైనర్. ఇది దేశానికి సంబంధించిన కథ కాదు, ఓ కుర్రాడి కుటుంబానికి చెందిన కథ. తమన్ ఈ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. మా ప్రయత్నం డిసెంబర్ 1న ‘జవాన్’ రూపంలో విడుదలవుతుంది అన్నారు.