నెల్లూరు నేపథ్యంలో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాకేందు వౌళి, కల్పిక జంటగా మేజిన్ మూవీ మేకర్స్ పతాకంపై హరీశ్ కె.వి. దర్శకత్వంలో సయ్యద్ నిజాముద్దీన్ రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. హీరో హీరోయిన్లపై నిర్మాత బెక్కం వేణుగోపాల్ క్లాప్‌నివ్వగా, సోనీ చరిష్ఠా కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- నెల్లూరు నేపథ్యంలో హిలేరియస్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా సాగే క్రైమ్ కామెడీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, రెండు షెడ్యూల్స్‌తో పాటలతోపాటు టాకీ పూర్తిచేస్తామని తెలిపారు. తనను నమ్మి ఈ కథతో సినిమా రూపొందిస్తున్న నిర్మాతకు దర్శకుడు కృతజ్ఞతలు తెలిపారు. తాను పోషిస్తున్న పాత్ర ఈ చిత్రంలో వైవిధ్యంగా వుంటుందని, దర్శకుడికి మంచి భవిష్యత్తు ఉండాలని నటుడు పృధ్వీ అన్నారు. కార్యక్రమంలో కృష్ణ్భగవాన్, రాకేందు వౌళి, కల్పిక తదితరులు పాల్గొని విశేషాలు తెలిపారు. తా.రమేష్, నెల్లూరు సుదర్శన్, తీన్‌మార్ హరీశ్, మహేష్ విట్టా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:రామిరెడ్డి, ఎడిటింగ్:వికాస్, పాటలు:వెనె్నలకంటి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం:హరీశ్.కె.వి.