10న దేవిశ్రీ ప్రసాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూపాల్, మనోజ్‌నందన్, పూజారామచంద్రన్ ప్రధాన తారాగణంగా ఆర్.ఓ క్రియేషన్స్ పతాకంపై కల్యాణకృష్ణ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘దేవిశ్రీప్రసాద్’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రిరిలీజ్ వేడుక హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ- కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా తప్పక నచ్చుతుందని, వైవిధ్యమైన కథనం ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశ్యంతో తాను ఈ చిత్రాన్ని రూపొందించానని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 10న థియేటర్‌లకు వస్తున్నామని తెలిపారు. యుఎస్‌ఏలో దాదాపు 45 థియేటర్‌లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని ఆయన అన్నారు. కొత్తగా టైటిల్ చూసి ఈ సినిమాలో కథ కూడా కొత్తగా వుంటుందని ప్రేక్షకులు భావిస్తారని, ప్రతి సినిమా సరికొత్తగా రూపొందించే ప్రయత్నం తాను చేస్తానని దర్శకుడు కల్యాణకృష్ణ అన్నారు. ఈ సినిమా ద్వారా ప్రతి అమ్మాయి తన జీవితంలో ఎదురయ్యే పలు సంఘటనలను తెలుగు నేటివిటీతో చిత్రీకరించారని, తప్పక అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉందని నాగానే్వష్ అన్నారు. కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి, అమ్మ రాజశేఖర్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, భూపాల్, ధన్‌రాజ్, పూజా రామచంద్రన్, అక్రోశ్ తదితరులు పాల్గొని చిత్ర విశేషాలను తెలిపారు.