ఇంద్రగంటి దర్శకత్వంలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత ఏడాది నానితో ‘జెంటిల్ మెన్’ వంటి చిత్రాన్ని రూపొందించిన దర్శక, నిర్మాతలు ఇంద్రగంటి మోహనకృష్ణ, శివలెంక కృష్ణ ప్రసాద్ మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఇందులో సుధీర్‌బాబు హీరోగా నటించనున్నారు. ప్రముఖ బాలీవుడ్ కథానాయిక, ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో ‘చెలియా’ సినిమా చేసిన అదితీరావ్ హైదరీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ పై ప్రొడక్షన్-10గా ఈ చిత్రం రూపొందనుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ- అనూహ్యమైన కథాంశంతో ఆద్యంతం వినోదాత్మకంగా నడిచే ఒక కొత్త తరం ప్రేమకథా చిత్రమిది అన్నారు. నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ- డిసెంబర్ రెండో వారంలో షూటింగ్ ప్రారంభిస్తాం. వేసవి కానుకగా ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం. ‘జెంటిల్‌మెన్’ తర్వాత మళ్లీ ఇంద్రగంటితో సినిమా నిర్మించడం చాలా ఆనందంగా వుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియజేస్తాం అని చెప్పారు.