గరుడవేగ వసూళ్లు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజశేఖర్ కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో జ్యోస్టార్ ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై రూపొందించిన ‘గరుడవేగ’ ఇటీవల ఈనెల 3న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బ్లక్‌బస్టర్ టాక్ తెచ్చుకుని విజయవంతంగా ప్రదర్శింపబడుతోందని, కలెక్షన్ల వర్షం రెండో వారం కూడా దిగ్విజయంగా కురుస్తోందని నిర్మాత ఎం. కోటేశ్వరరాజు తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ- తాను నిర్మాతగా చేసిన తొలి సినిమా ఇంత విజయవంతమవడం సంతోషంగా వుందని, టీజర్ విడుదలైనప్పటినుండీ భారీ అంచనాలు నెలకొన్నా, అవన్నింటినీ మించుతూ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోందని తెలిపారు. రాజశేఖర్ నటన, ప్రవీణ్ సత్తారు టేకింగ్ ఈ సినిమాలో హైలెట్‌గా నిలిచాయని, ఐదు రోజుల్లో 15 కోట్లకుపైగా వసూళ్లు సాధించాయని, థియేటర్ల సంఖ్య పెరిగిందని అన్నారు. ఇంత విజయం అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞలు తెలుపుతున్నామని అన్నారు.