ప్రేమలో పడ్డా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా తారలంతా క్రికెటర్ల ప్రేమలో పడతారెందుకు? అని ప్రేక్షకులు ఎప్పుడూ అనుకుంటారు. కానీ వారు పిచ్‌లో ప్రదర్శించే క్రీడా నైపుణ్యమే అభిమానులుగా మారుస్తుందని, ఆ పైన ప్రేమికులుగా మారుతున్నారని గతంలో కొన్ని సంఘటనలు రుజువుచేశాయి. ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న అనుష్క కూడా ఓ క్రికెటర్ ప్రేమలో పడిపోయింది. తన అభిమాన క్రికెటర్ ఎవరో తెలియజేసింది. కెరీర్ తొలి నాళ్లల్లో అతనితో ప్రేమలో పడిపోయిందట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన అభిమాన క్రికెటర్ ఎవరు అని ప్రశ్నిస్తే, అనుష్క రాహుల్ ద్రావిడ్ అని సమాధానమిచ్చింది. తన చిన్నతనం నుండే రాహుల్ ద్రావిడ్ అంటే చాలా పిచ్చి ఉండేదని, ఎంతలా అంటే ఒకానొక సమయంలో అతనితో గొంతువరకు ప్రేమలో మునిగిపోయానని చెప్పుకొచ్చింది. అది అనుష్క మాజీ ప్రేమకథ.