సిద్ధమవుతున్న జవాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయిధరమ్‌తేజ్ కథానాయకుడిగా అరుణాచల్ క్రియేషన్స్ పతాకంపై కృష్ణ రూపొందించిన చిత్రం ‘జవాన్’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి డిసెంబర్ 1న విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు. సినిమాకు సంబంధించిన గ్రాండ్ ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో ఈనెల 19న నిర్వహించడానికి యూనిట్ సన్నాహాలు చేస్తోంది. మెహరీన్ ఫిర్జాదా కథానాయికగా నటించిన ఈ చిత్రం గూర్చి దర్శకుడు బి.వి.ఎస్.రవి మాట్లాడుతూ- దేశానికే కాక ప్రతి ఇంటికి జవాన్ ఉండాలని, దేశాన్ని ప్రాణంగా, బాధ్యతగా భావించి అహర్నిశలు రక్షణ కల్పించాలన్న అన్న కథనంతో ఈ చిత్రాన్ని రూపొందించామని తెలిపారు. దేశంలోని తన ఇంటిని, ఇంటిలోనివారిని గుండెల్లో పెట్టుకుని కాపాడుకునే మా చిత్ర కథానాయకుడి కథనంతో ఈ సినిమా సిద్ధమైందని, ఇప్పటివరకూ విడుదలచేసిన ప్రతి ప్రమోషనల్ మెటీరియల్‌కు మంచి స్పందన లభించిందని తెలిపారు. ఇటీవల విడుదల చేసిన ‘బుగ్గంచున..’ అనే రొమాంటిక్ పాట మీడియాలో నెంబర్‌వన్ పాటగా ఆదరణ పొందుతోందని, అభిమానుల అంచనాలను అందుకునేలా ఈ చిత్రం ఉంటుందని తెలిపారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడి పాత్రలో సాయిధరమ్ కన్పిస్తాడని, తన కుటుంబాన్ని మనోధైర్యంతో బుద్ధిబలంతో ఎలా కాపాడుకున్నాడు అన్న కథనంతో పక్కా ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, ప్రసన్న చేసిన స్పెషల్ కారెక్టర్ సరికొత్తగా వుంటుందని ఆయన అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:తమన్, నిర్మాత:కృష్ణ, దర్శకత్వం:బి.వి.ఎస్.రవి.