అరుదైన అవకాశం:కార్తికేయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ప్రేమతో మీ కార్తీక్’ సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమవుతున్నాడు యువ హీరో కార్తికేయ. సత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను కార్తికేయ తెలియజేస్తూ- ‘చిన్నప్పటినుండే సినిమాల్లోకి రావాలనుకున్నా. బిటెక్ పూర్తయ్యాక కొన్ని షార్ట్ ఫిలింస్‌లో చేశా. సినిమాలో అవకాశం వచ్చినా లేక ఇద్దరు ముగ్గురు హీరోల మధ్య ఒక హీరోగా నటించినా ఫర్వాలేదనుకున్నా. కానీ ఈ చిత్ర నిర్మాత ఫోన్ చేసి అవకాశమిచ్చారు. ఇది నాకు అరుదైన అవకాశమే. ఇక సినిమా గురించి చెబితే, కార్తీక్ అనే అబ్బాయి అమెరికాలో పుట్టి పెరుగుతాడు. అతనికి లవ్ ఎమోషన్స్ లాంటి భావోద్వేగాలు ఏమీ వుండవు. అటువంటివాడి జీవితంలో ఓ అమ్మాయి వచ్చాక అతని జీవితం ఎలా మారిపోయింది? అన్న కథనమే ఈ సినిమా. గొల్లపూడితో ఈ సినిమాలో పనిచేయడం సంతోషంగా భావిస్తా. సెట్‌లో ఆయనిచ్చిన సహకారం మరువలేను. ఆయన ఎపిసోడ్ ఈ చిత్రానికి హైలెట్‌గా వుంటుంది. సత్యాకు తొలి సినిమా అయినా అనుభవం వున్న దర్శకుడిలా తెరకెక్కించారు. పెద్ద తరహా సినిమాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. టైటిల్ రోల్‌లో నేను నటించడం చాలా అదృష్టంగా భావిస్తున్నా.