సప్తగిరి ఎల్‌ఎల్‌బి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాస్య కథానాయకుడు హీరోగా సాయి సెల్యూలాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ పతాకంపై చరణ్ లక్కాకుల దర్శకత్వంలో డా.రవికిరణ్ రూపొందించిన తాజా చిత్రం ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’. హిందీలో విజయవంతమైన ‘జాలీ ఎల్‌ఎల్‌బి’ని తెలుగులో రీమేక్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను యువ కథానాయకుడు రామ్‌చరణ్ విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా రవికిరణ్ మాట్లాడుతూ- ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి ఆదరణ లభిస్తోందని, అలాగే రామ్‌చరణ్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారని, త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామన్నారు. మంచి కథతో రూపొందించిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుందని కథానాయకుడు సప్తగిరి అన్నారు. కశీష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు:పరుచూరి బ్రదర్స్, సంగీతం:విజయ్ బుల్గానిన్, కెమెరా:సారంగం ఎస్.ఆర్., పాటలు: చంద్రబోస్, కందికొండ, నిర్మాత:డా.రవికిరణ్, దర్శకత్వం:చరణ్ లక్కాకుల.