మార్చిలో జతగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘ఉస్తాద్ హోటల్’ చిత్రాన్ని తెలుగులోకి ‘జతగా’ పేరుతో విడుదల చేస్తున్నారు. పలు హిట్ చిత్రాల్ని అందించిన సురేష్ కొండేటి నిర్మిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైన సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలు చెప్పారు. మలయాళంలో మ్యూజికల్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా కథ, కథనం అందరినీ ఆకట్టుకుంటాయని, లవ్, సెంటిమెంట్, పేద, ధనికవర్గాల మధ్య భేదం వంటి అంశాలకు ఆసక్తికరంగా తెరకెక్కించామని చెప్పారు. తెలుగులో సాహితి రాసిన సంభాషణలు ఆకట్టుకుంటాయని, దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ ‘ఓకె బంగారం’ సినిమాతో హిట్ జంటగా గుర్తింపు తెచ్చుకున్నారని, మళ్లీ వారి కలయికలో వస్తున్న ఈ సినిమా కూడా తెలుగులో మంచి విజయం సాధిస్తుందని అన్నారు. ఇప్పటికే తొలి కాపీ సిద్ధమైందని, మార్చి మొదటివారంలో చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు. ఈ చిత్రానికి సంగీతం:గోపీసుందర్, కెమెరా:ఎస్.లోకనాథన్, నిర్మాత:సురేష్ కొండేటి, దర్శకత్వం:అన్వర్ రషీద్.

దుల్కర్ సల్మాన్ నిత్యామీనన్