జనవరిలో భాగమతి రానుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనుష్క ప్రధాన పాత్రలో యు.వి.క్రియేషన్స్ పతాకంపై అశోక్.జి దర్శకత్వంలో వంశి, ప్రమోద్ రూపొందించిన ‘్భగమతి’ చిత్రం జనవరి 26న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌లో అనుష్క గెటప్ అందరినీ ఆకర్షిస్తోందని, ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూడాలన్న క్రేజ్ తెచ్చుకుందని తెలిపారు. ఫస్ట్‌లుక్ విడుదల తరువాత సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయని, అనుష్క నటన హైలెట్‌గా సాగే ఈ చిత్రాన్ని దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారని తెలిపారు. కథకు తగిన విధంగా భారీ బడ్జెట్‌తో తెరెకెక్కిన ఈ చిత్రంలో ప్రతి సన్నివేశంలో రీరికార్డింగ్ హైలెట్‌గా వుంటుందన్నారు.
గణతంత్ర దినోత్సవ కానుకగా జనవరి 26న విడుదల చేస్తున్నామని వారు తెలిపారు. ఉన్ని ముకుందన్, జయరాం, ఆశా శరత్, మురళీశర్మ, ధన్‌రాజ్, ప్రభాస్ శ్రీను, విద్యుల్లేఖారామన్, దేవదర్శిని, తలైవాసన్ విజయ్, అజయ్ ఘోష్, మధునందన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:ఎస్.ఎస్.తమన్, కెమెరా:మది, నిర్మాతలు:వంశి, ప్రమోద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:అశోక్.