ధైర్యంగా మాట్లాడాలి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినీ రంగంలో మహిళల వేధింపులపై మహిళలు బహిరంగంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది అని అంటోంది నేహా ధూపియా. ఇటీవల అన్ని చిత్ర పరిశ్రమల్లో లైంగిక వేధింపులపై చర్చ జరుగుతున్న విషయం విదితమే. పలువురు కథానాయికలు ఈ అంశంపై తమ అనుభవాలను ఏదో ఒక మాథ్యమం ద్వారా బాహాటంగా తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో బాలీవుడ్ కథానాయిక నేహా ధూపియా స్పందించింది. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనే కాదు ఇతర రంగాల్లో కూడా ఎవరైతే లైంగిక వేధింపుల కు గురయ్యారో వారంతా బయటికి రావాలి. ధైర్యంగా మాట్లాడాలి. ఈరోజు మనకు జరిగింది, రేపు మరో అమ్మాయికి జరగవచ్చు. మనం మాట్లాడడంవల్ల మునుముందు మహిళలు లైంగిక వేధింపులకు గురికాకుండా కాపాడగలిగినవాళ్ళమవుతాం. అందుకు మీడియా, ఫ్యామిలీ సపోర్టు కూడా కావాలి అని తెలిపింది.