సైరా కోసం టెస్ట్ షూట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా ‘సైరా నరసింహారెడ్డి’ రెగ్యులర్ షూట్‌కు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తిచేసిన టీమ్ షూట్‌కు వెళ్లబోయే ముందు ఒక ట్రయల్ వేసి చూశారు. ఆ ముందస్తు ప్రయత్నంలో మెగాస్టార్ చిరంజీవిపై టెస్ట్ షూట్ నిర్వహించారు. ఆ టెస్ట్ షూట్ ఔట్‌పుట్ చాలా బాగా వచ్చిందట. చిరు లుక్స్ దగ్గరనుంచి కాస్ట్యూమ్స్ వరకు అన్నీ పర్‌ఫెక్ట్‌గా కుదిరాయని టాక్. దీంతో టీమ్ రెట్టించిన ఉత్సాహంతో షూటింగ్‌కు రెడీ అవుతున్నారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందించనుండగా రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం 150 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించినట్టు తెలుస్తోంది. మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది.