సంచలనమే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లైంగిక వేధింపులపై ఈమధ్య చాలామంది బహిరంగంగానే స్పందిస్తున్నారు. తాజాగా ఈ విషయంపై సంచలనమే క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఈ వేధింపులపై ఘాటు కామెంట్ చేసి సంచలనం రేపిన బాలయ్య హీరోయిన్ రాధికాఆప్టే మరోసారి స్పందించింది. బాలయ్య సరసన లెజెండ్ సినిమాలో నటించిన ఈ భామ అస్సలు తెలుగులో సినిమాలే చేయనని, ఇక్కడ మగవాళ్ల రాజ్యం ఉందని చెప్పింది. ప్రస్తుతం బాలీవుడ్‌లోనే సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు మరోసారి లైంగిక వేధింపులపై స్పందించింది. లైంగిక వేధింపులు ఒక్క గ్లామర్ ఫీల్డ్‌కే పరిమితం కాదని, కానీ అన్ని ప్రాంతాల్లో ఈ తరహా వేధింపులు ఉన్నాయని చెప్పింది రాధిక. గృహహింస అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉందని, ఆఖరికి ఇంట్లోనే ఉండే వ్యక్తులు కూడా ఈ వేధింపులకు గురి కావాల్సి వస్తోందని వీటిని అరికట్టే అవసరం ఎంతైనా ఉందని చెప్పింది. ఈ వేధింపులు ఒక్క మహిళలకే కాదని.. మగవాళ్లు కూడా ఎదుర్కొంటున్నారని సంచలన కామెంట్స్ చేసింది.