ఎన్‌టిఆర్ చిత్రంలో టబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్‌టిఆర్ తన 28వ చిత్రాన్ని చేయనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ అట్టహాసంగా ప్రారంభోత్సవ వేడుకను జరుపుకుంది. ఎప్పటి నుండో కోరుకుంటున్న వీరిద్దరి కలయిక ఎట్టకేలకు కుదరడంతో తారక్ అభిమానులు, సగటు ప్రేక్షకులు రాబోయే ఔట్‌పుట్ పట్ల ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఇకపోతే సినీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఒక కీలక పాత్ర కోసం సీనియర్ హీరోయిన్ టబును తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట త్రివిక్రమ్. ఆమె చేరిక వలన పాత్రకు హుందాతనంతో పాటు సినిమాకు కొత్తదనం కూడా వస్తుందని త్రివిక్రమ్ భావిస్తున్నారట. అయితే ఈ వార్తపై చిత్ర టీమ్ నుండి అధికారిక సమాచారం వెలువడాల్సి వుంది. త్రివిక్రమ్ ప్రస్తుతం పవన్‌తో చేస్తున్న సినిమాలో సైతం సీనియర్ నటి కుష్బూ చేత ఒక ముఖ్య పాత్ర చేయిస్తున్న సంగతి తెలిసిందే.