మరో రీమేక్‌లో నిఖిల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైవిధ్యమైన సినిమాలు చేస్తూ కొత్త దర్శకులను ప్రోత్సహించే నిఖిల్‌కు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌తో పాటు మంచి మార్కెట్ ఉంది. ప్రస్తుతం ఈ హీరో ‘కిరిక్ పార్టీ’ సినిమా రీమేక్‌లో నటిస్తున్నాడు. ఆ ప్రాజెక్టు తరువాత నిఖిల్ తమిళ్‌లో సూపర్‌హిట్ అయిన ‘కనితన్’ను తెలుగులో రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు ఈ సినిమా నిర్మించబోతున్నారు. డిసెంబర్‌లో ప్రారంభమయ్యే ఈ సినిమా జనవరి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. తమిళ్‌లో ఈ సినిమాను డైరెక్ట్ చేసిన సంతోష్ తెలుగులో కూడా దర్శకత్వం వహించే అవకాశం వుంది. ఈ సినిమాతో పాటు కార్తికేయ సినిమా సీక్వెల్‌లో నటించబోతున్నాడు.