సినిమా పరిశ్రమపై అసభ్యకరమైన వ్యాఖ్యలు సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాధ్యతాయుతమైన పదవి అయిన బిజెపి ఎంపీగా వుండి ‘పద్మావతి’ సినిమా గురించి నచ్చకపోతే ఆ సినిమాపై వ్యాఖ్యలు చేయాలి కానీ, సినిమా పరిశ్రమ మొత్తాన్ని తప్పుపట్టి మాట్లాడడం, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం బాధాకరమని టి.ఎఫ్.సి.సి చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ తెలిపారు. పద్మావతి సినిమాకు వున్న వివాదాలు మరే సినిమాకు చుట్టుకోలేదేమో. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని ఎంపీగా వున్న చింతయని మాలియా సినిమా పరిశ్రమలో వున్నవారిపై అభ్యంతరకర వ్యాఖ్యానాలు చేయడంతో హైదరాబాద్‌లో బుధవారం ఉదయం టిఎఫ్‌సిసి సమావేశం ఏర్పాటు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్.కె.గౌడ్ మాట్లాడుతూ- సినిమా పరిశ్రమలో వున్నవాళ్ల భార్యలపై అసభ్యకర వ్యాఖ్యానాలు చేయడం తాము ఖండిస్తున్నామని, సినిమా పరిశ్రమలోని ఆడవాళ్లను, ఆడబిడ్డలను తమ పిల్లల్లా చూసుకుంటుంటే ఇలాంటి వ్యాఖ్యలతో అవమానించడం సహించలేని విషయంగా ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా బిజెపి ఎంపీ వ్యాఖ్యలను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, అసలు పద్మావతి సినిమా కథ అతనికి తెలుసా? అని ఆయన ప్రశ్నించారు. సినిమా చూసి వ్యతిరేకించాలి కాని ఇలా తెలిసీ తెలియని విషయాన్ని తీసుకుని బూతద్దంలో చూసి ఇతరులను తప్పుబట్టడం సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు. 1540వ సంవత్సరంలో రాసిన ఒక నవలే పద్మావతిగా వస్తోందని, మంచి కథను విమర్శించేటప్పుడు ఆయా విశేషాలను తెలుసుకొని విమర్శించాలని ఆయన హితవు పలికారు. ఎలాంటి విషయాలు తెలుసుకోకుండా ఓ ఎంపీగా కొనసాగడాన్ని తాము చింతిస్తున్నామన్నారు. ఈనెల 28న ప్రధాని నరేంద్ర మోదీని కలిసి ఆ ఎంపీని సస్పెండ్ చేయాలని తాము డిమాం డ్ చేయనున్నామని, అంతేకాక నేడు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆవరణలో సినిమావాళ్ళంతా కలిసి ఎంపీ దిష్టిబొమ్మను తగులబెట్టనున్నామని ఆయన అన్నారు. ఎంపీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే ఢిల్లీదాకా తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. సినిమా వాళ్ళంటే ప్రతివారికీ ఉన్న చులకన భావన ఎంపీకి కూడా ఉండడం సరైన పద్ధతి కాదని, ఎంటర్‌టైన్‌మెంట్ కావాలంటే మళ్లీ సినిమావాళ్ల దగ్గరకే వస్తారని, ఇదెక్కడి న్యాయమని ‘మా’ అధ్యక్షురాలు కవిత ఆవేదన వ్యక్తం చేశారు. గొప్ప పేరున్న పరిశ్రమను ఇలా తప్పుబట్టి నీచమైన వ్యాఖ్యానాలు చేసిన ఎంపీని ఏమనాలని, మహోన్నత పదవిలో వుంటూ కూడా మహిళల గురించి ఇలా అసభ్యంగా మాట్లాడి దిగజారిపోవడం బాధాకరమని ఆమె అన్నారు. లోకల్ మీడియాలోనే కాకుండా జాతీయ స్థాయి మీడియాలో కూడా ఈ విషయంపై ఉధృతమైన పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నామని, అలాగే తెలిసీ తెలియనితనంతో తెలుగుదేశం మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యానాలు కూడా ఖండిస్తున్నామని ఆమె అన్నారు. సినిమా వాళ్లకు ఆధార్ కార్డులు లేవని, టాక్స్ ఇక్కడ కట్టడం లేదని అన్న ఆయన మాటలను ఖండిస్తున్నామని ఆమె తెలిపారు.
నంది అవార్డుల స్థితిగతులు నేడు పూర్తిగా మారిపోయాయని, బాగా నటిస్తారని ప్రేక్షకులు చెబితే చాలు గాని, అవార్డులు వస్తేనే గొప్ప నటులని ముద్రవేయడం సరైనది కాదని ఆమె తెలిపారు. ఎంపీ చేసిన వ్యాఖ్యానాలు తాము వ్యతిరేకిస్తున్నామని సాయివెంకట్, మోహన్‌గౌడ్ తెలిపారు.