ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహీధర్, ఇషిత, ప్రశాంత్, లలిత ప్రధాన తారాగణంగా లక్ష్మీప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై శివసాయి సమర్పణలో వెంకటేష్.కె దర్శకత్వంలో ప్రశ్నాద్ తాత రూపొందించిన చిత్రం ‘ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారండి బాబూ’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 24న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ఇప్పట్లో రాముడిలా సీతలా ఉండాలని ప్రతి ఒక్కరూ ఎలా అనుకుంటారో, అదే విషయాన్ని ఈ చిత్రంలో తాము చూపించామని, ఇప్పుడు వస్తున్న వెజిటేరియన్ సినిమాలమధ్య ఓ నాన్‌వెజిటేరియన్ మూవీగా ఈ సినిమా వస్తుందని, కథ కథనాలు ప్రాధాన్యతతో వుంటాయని తెలిపారు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రం వైజాగ్, నెల్లూరు తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేశామని దర్శకుడు వెంకటేశ్ తెలిపారు. ఈ చిత్రంలో తాను కథానాయకుడిగా నటించానని, టైటిల్ ఎంత డిఫరెంట్‌గా ఉంటుందో చిత్ర కథాంశం కూడా అంతే వైవిధ్యంతో వుంటుందని హీరో మహీధర్ తెలిపారు.
అన్ని పాత్రలకు సమానమైన ప్రాధాన్యత వుంటుందని, రొమాంటిక్ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ చిత్రంలో నటించిన మరో హీరో ప్రశాంత్ భౌతికంగా తమకు దూరమవడం విషాదమని ఆయన అన్నారు.
కార్యక్రమంలో కథానాయిక ఇషిక, నటుడు బాబు తదితరులు విశేషాలు తెలిపారు. రాంజగన్, వైభవ్, సూర్య, జబర్దస్త్ భాస్కర్, తరుణి, కిరణ్, బాబు, తులసి, నందిని, మధు, జి.ఎస్.ఆర్.పవన్, రాధాకృష్ణ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:ఎ.జగన్, పాటలు:చైతన్య రాపేటి, సంగీతం:రమేష్.డి, ఎడిటింగ్:సత్య, నిర్మాత:ప్రశ్నాద్ తాత, దర్శకత్వం:వెంకటేష్.కె.