నాగచైతన్య సవ్యసాచి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగచైతన్య కథానాయకుడిగా మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘సవ్యసాచి’. ఈ చిత్రానికి సంబంధించిన ఒక షెడ్యూల్ పూర్తిచేశారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మాధవన్ ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. సినిమా గూర్చి నిర్మాతలు వై.నవీన్, వై.రవిశంకర్, మోహన్ మాట్లాడుతూ- ప్రస్తుతం రెండో షెడ్యూల్‌ను జరుపుతున్నామని, హీరో హీరోయిన్, మాధవన్‌తో వున్న సన్నివేశాలు చిత్రీకరిస్తున్నామని తెలిపారు. సవ్యసాచి చిత్రంలో నటించడం ఓ మంచి అనుభవంగా ఉన్నదని, ఔట్‌స్టాండింగ్ చిత్రంలా దర్శకుడు రూపొందిస్తున్నాడని మాధవ్ తెలిపారు. నాగచైతన్య జన్మదినోత్సవం సందర్భంగా సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశామని దర్శకుడు తెలిపారు. రావు రమేష్, వెనె్నల కిశోర్, సత్య, తా.రమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:కీరవాణి, కెమెరా:యువరాజ్, ఎడిటింగ్:కోటగిరి, నిర్మాతలు:వై.నవీన్, వై.రవిశంకర్, మోహన్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:చందూ మొండేటి.