అందరికి నచ్చే మెంటల్ మదిలో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపథ క్రియేషన్స్ పతాకంపై వివేక్ ఆత్రేయను దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీవిష్ణు, నివేదా పెతురాజ్ జంటగా డి.సురేష్‌బాబు సమర్పణలో తెరకెక్కిన ‘మెంటల్ మదిలో’ చిత్రం శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా నిర్మాత రాజ్‌కందుకూరి చెప్పిన విశేషాలు..
దర్శకుడు వివేక్ చెప్పిన కథ బాగా నచ్చింది. వివేక్ ఓ కాఫీ షాప్‌లో కలిసి కావ్యం పేరుతో ఓ పొయట్ కథను వినిపిస్తే అలాంటి కథను నేను చేయలేకపోవచ్చని అన్నాను. అప్పుడు అతను నిరాశతో వెళ్లిపోయి మళ్లీ వారం తరువాత ఫోన్ చేశాడు. ఆ తరువాత మరో కథ చెప్పాడు. కథ విని స్పెల్‌బౌండ్ అయ్యాను. చాలా మంచి కథ విన్నాననిపించింది. అలాగే యంగ్ టీమ్‌తో ఈ సినిమా తెరకెక్కింది. పెళ్లిచూపులు తరువాత మా బ్యానర్ నుండి వస్తున్న సినిమాపై తప్పకుండా భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను ఏ మాత్రం తగ్గించుకుండా ఈ సినిమా ఉంటుం ది. పొయట్ లాంటి ప్రేమకథతో తెరకెక్కింది. వివేక్ ఇందులో రెండు పాటలు కూడా రాశాడు. ఇప్పటికే విడుదలైన ఆడియో మంచి విజయాన్ని అందుకుంది. ఎక్కడైతే నిజాయితీతో ప్రయత్నం చేస్తామో అక్కడ తప్పకుండా విజయం దక్కితీరుతుంది. ఇక మాకు ఎల్లప్పుడూ సపోర్టు అందించే సురేష్‌బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఇందులో నటించిన శ్రీవిష్ణు పాత్రలో ఒదిగిపోయాడు. చాలా డీసెంట్ నటుడు. అలాగే హీరోయిన్ నివేద అద్భుతంగా నటించింది. తప్పకుండా ప్రతి ఒక్కరికీ నచ్చే చిత్రమవుతుంది. ముఖ్యంగా ప్రేక్షకుల మదిని తాకే చిత్రం ఇది అన్నారు.