ఇంద్రగంటి దర్శకత్వంలో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని హీరోగా శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ‘జెంటిల్‌మేన్’ చిత్రం ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. ఇప్పుడు ఆ దర్శక నిర్మాతలు మరోసారి కలిసి సినిమా చేస్తున్నారు. సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న ఈ తాజా చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరిగాయి. మణిరత్నం ‘చెలియా’ సినిమాలో నాయికగా నటించి అందర్నీ ఆకట్టుకున్న బాలీవుడ్ భామ అదితీరావు హైదరీ ఈ చిత్రంలో నాయికగా నటిస్తోంది. శ్రీదేవి మూవీస్ ప్రొడక్షన్ నెం.10గా ఈ సినిమాను నిర్మిస్తోంది. నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ- ‘ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను నిర్వహించాం. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో మా సంస్థలో మేం నిర్మించిన ‘జెంటిల్‌మేన్’ ఎంతటి విజయాన్ని అందుకుందో అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ తాజా సినిమా స్క్రిప్ట్ కూడా చాలా బాగా వచ్చింది. సుధీర్‌బాబుకి పర్‌ఫెక్ట్ సినిమా అవుతుంది. డిసెంబర్ 11 నుంచి నిరవధికంగా షూటింగ్ చేస్తాం. మార్చితో చిత్రీకరణ పూర్తవుతుంది. మేలో సినిమా విడుదల చేస్తాం. హైదరాబాద్, హిమాచల్ ప్రదేశ్, ముంబైలోని సరికొత్త లొకేషన్లలో చిత్రాన్ని తెరకెక్కిస్తాం’ అని చెప్పారు. దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ- ‘అనూహ్య కథాంశంతో ఆద్యంతం వినోదాత్మకంగా నడిచే ఒక కొత్త తరం ప్రేమకథా చిత్రమిది’ అన్నారు. సుధీర్‌బాబు, అదితీరావు హైదరీ, నరేశ్, తనికెళ్లభరణి, రోహిణి, నందు, కేదార్ శంకర్, కాదంబరి కిరణ్, హరితేజ, రాహుల్ రామకృష్ణణ్, శిశిర్‌శర్మ తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేశ్, కెమెరా: పి.జి విందా, సంగీతం: వివేక్ సాగర్, నిర్మాత: శివలెంక కృష్ణ ప్రసాద్, రచన, దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.