కమర్షియల్ దారిలో దర్శకేంద్రుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్ కమర్షియల్ టాలెంటెడ్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రము ఖ దర్శకుడు రాఘవేంద్రరావు 100 సినిమాలు పూర్తిచేసి సత్తాచాటుకున్న విష యం తెలిసిందే. ఈమధ్యే ఆయన కమర్షియల్ చిత్రాలను కాకుండా భక్తిరస చిత్రాలవైపు మొగ్గుచూపి ఆ తరహా సినిమాలు తెరకెక్కిస్తున్నారు. అన్నమయ్య తరువాత ఆయన శ్రీరామదాసు, మంజునాథ, షిరిడీ సాయి చిత్రాలను తెరకెక్కించారు. తాజాగా నాగార్జునతో తీసిన ‘ఓం నమో వెంకటేశాయ’ చిత్రం అనుకున్న స్థాయి విజయాన్ని అందుకోకపోవడంతో ఆయన కొంత గ్యాప్ తీసుకుని మళ్లీ కమర్షియల్ బాట పట్టారు. అప్పట్లో యువ హీరోలతో ఫక్తు కమర్షియల్ సినిమాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన మళ్లీ నేటి తరం యువ హీరోలతో కమర్షియల్ సినిమాలు రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నాడట. కమర్షియల్ సినిమాలు తీయడంలో రాఘవేంద్రరావు ఫార్ములాయే వేరు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయని, ఓ యువ హీరోతో ఈ సినిమా వుంటుందని సమాచారం.