హరీశ్ శంకర్ మల్టీస్టారర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో ఓ ఫుల్ మాస్ మల్టీస్టారర్ సినిమా వచ్చి చాలాకాలం అవుతోంది. ముఖ్యంగా స్టార్ హీరోలు అలాంటి సినిమాలు చేయడంలేదు. అనేకసార్లు కొందరు దర్శకులు కథ సిద్ధమని చెప్పినా, మళ్లీ వాటి ప్రస్తావన తీసుకురావడంలేదు. తాజాగా మరొక మల్టీస్టారర్ చిత్రం తప్పకుండా వస్తోం ది అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. దువ్వాడ జగన్నాథమ్ చిత్రంతో వచ్చిన హరీశ్ శంకర్, తరువాత చిత్రాన్ని ఫుల్ మాస్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వుండేటట్లు చేస్తానని తెలిపారు. అంతేకాకుండా ఒక మల్టీస్టారర్ కథ అని టాక్‌కూడా వచ్చింది. మొదట ఆ కథలో నానితోపాటు యువ మెగా హీరోల పేర్లు బాగా వినిపించాయి. ఇప్పుడు మాత్రం ఓ సరికొత్త కాంబో అని అందరినీ థ్రిల్‌కు గురిచేస్తున్నారు. వారెవరో కాదు, నితిన్, శర్వానంద్‌తో కలిసి హరీశ్ శంకర్ వినోదాత్మకంగా ఓ చిత్రాన్ని రూపొందించడానికి సిద్ధమయ్యారట. తాజాగా వీరిద్దరికీ కథను వినిపించారని తెలుస్తోంది. హరీశ్ శంకర్ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను త్వరలో పూర్తిచేయనున్నాడు. అయితే సినిమా ఎప్పుడు మొదలుకానుందో తెలియాల్సి వుంది.