‘జవాన్’ సెన్సార్ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్, మెహరీన్ ఫిర్జాదా జంటగా బివిఎస్ రవి దర్శకత్వం వహించిన చిత్రం ‘జవా న్’, ఇంటికొకడు సినిమా క్యాప్షన్. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ధియోట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. రొమాంటిక్ కామెడీగా స్టార్ట్ అయిన ఈ ట్రైలర్ హైటెక్నాలజీతో దేశభక్తిని మేళవించి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అందరి ప్రశంసలు పొందుతుంది. డిసెంబర్ 1న విడుదల కానున్న ‘జవాన్’ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని యు/ఎ సర్ట్ఫికెట్‌తో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దర్శకుడు బివిఎస్ రవి మాట్లాడుతూ- ఎన్నిసార్లు చెప్పినా మరొకసారి చెప్పటానికి నేను గర్వపడుతున్నాను. దేశానికి జవాన్ ఎంత అవసరమో.. ప్రతి ఇంటికి మా కథానాయకుడు లాంటివాడు అవసరం. మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడి పాత్రలో సాయిధరమ్ తేజ్ ఒదిగిపోయి నటించాడు. తన కుటుంబాన్ని, అదేవిధంగా దేశాన్ని మనోధైర్యంతో, బుద్ధిబలంతో ఎలా కాపాడుకున్నాడన్నదే జవాన్ కథ. అందుకే ఇంటికొక్కడు అనే క్యాప్షన్ పెట్టాము. ఇది పక్కా ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన ఎంటర్‌టైనింగ్ కమర్షియల్ చిత్రం. తమన్ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు.
మెహ్రీన్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. ప్రసన్న పాత్ర చాలా బాగా డిజైన్ చేశాము. బేసిక్‌గా ఇద్దరూ ఈక్వల్ ఏజ్ గ్రూప్ వున్నవాళ్లను సెలెక్టు చేశాము. సినిమాలో ప్రతి సీన్‌కి తమన్ సూపర్బ్ రీరికార్డింగ్ ఇచ్చాడు. ఎడిటింగ్ టేబుల్‌మీద సినిమా ఓ రేంజ్‌లో వుంటే తమన్ ఆర్‌ఆర్ తరువాత రేంజ్ డబుల్ అయ్యింది. అలాగే ఈరోజు సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్నది. డిసెంబర్ 1న యు/ఎ సర్ట్ఫికెట్‌తో విత్‌అవుట్ కట్స్‌తో గ్రాండ్‌గా అత్యధిక థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ చిత్రం తప్పకుండా మెగా అభిమానుల్ని, అన్ని వర్గాల ప్రేక్షకుల అంచనాలు అందుకుంటున్నది అని అన్నారు. సాయిధరమ్ తేజ్, మెహరీన్, ప్రసన్న, జయప్రకాష్, ఈశ్వరీరావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరామెన్:కె.వి.గుహన్, మ్యూజిక్:ఎస్.తమన్, ఆర్ట్:బ్రహ్మకడలి, ఎడిటింగ్:ఎస్.ఆర్.శేఖర్, మధు, నిర్మాత:కృష్ణ, కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వం:బి.వి.ఎస్.రవి.