నమిత వివాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు, తమిళ భాషల్లో బొద్దుగుమ్మగా ఓ రేంజ్ పాపులారిటీ సంపాదించుకున్న నమిత పెళ్లి నేడు తిరుపతిలో జరిగింది. ఇటీవలే ఈ వివాహ సందర్భంగా ఓ హోటల్‌లో సంగీత్ కార్యక్రమం కూడా అట్టహాసంగా జరిగింది. తమిళ నటుడు వీరేంద్ర చౌదరితో నమిత వివాహం శుక్రవారం తిరుపతిలో ఉదయం 5.30లకు ఇస్కాన్ టెంపుల్‌లో జరిగింది. ఎందరో రసిక హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న నమిత పెళ్లి తరువాత సినిమాలు చేస్తుందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. ఈ వివాహ వేడుకకు శరత్‌కుమార్, రాధిక తదితర చిత్ర ప్రముఖులు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు అందజేశారు.