సైరాలో.. పవర్‌స్టార్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజంగా ఇది మెగా ఫ్యాన్స్‌కు షాకిచ్చే విషయమే. అంతేకాదు మెగా ఫ్యాన్స్‌కు పెద్దగా పండగ లాంటి న్యూస్.. అదేమిటంటారా.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 151వ సినిమా ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో పవర్‌స్టార్ కళ్యాణ్ గెస్ట్ పాత్ర చేయడానికి ఓకె చెప్పాడట. మీరు వింటున్నది నిజమే.. చిరంజీవి కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో భారీ సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా డిసెంబర్ 6 నుండి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ కీ రోల్ ఉందట.. ఆ పాత్రకోసం మొదట వెంకటేష్‌తో చేయించాలని భావించారు. కానీ పవన్‌కళ్యాణ్ అయితే సినిమాకు ఇంకాస్త క్రేజ్ పెరుగుతుందన్న ఆలోచనతో పవన్‌తో చర్చలు జరిపాడట చిరు.. ఇంక చిరు చెప్పాక పవన్ నో అంటాడా.. సరే అని చెప్పాడట. దాంతో సైరా సినిమాలోని కీ రోల్‌లో పవన్ నటించనున్నాడు. ఆయన పాత్ర కేవలం పది నిమిషాలపాటు ఉంటుందని టాక్. మొత్తానికి మెగాస్టార్ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న సైరాలో మెగా హీరోలందరూ కనువిందు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్.