టాలీవుడే టార్గెట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘చలన చిత్ర చరిత్రలో నాదంటూ ఓ పేజీ, నాకంటూ ఓ సినిమా ఉండాలన్నది ప్రతి నటీ, నటుడూ కోరుకోవడం సహజం. నేనూ అంతే! నటనకు ప్రాధాన్యం వున్న పాత్రలు దొరకడం చాలా అరుదు. నా తొలి ప్రయత్నంలోనే నాకు ఆ అవకాశం దక్కింది. అందుకు నేను చాలా ఆనందపడ్డాను. సినిమాల్లోకి వస్తాను అని అనుకోలేదు. కానీ వచ్చాను. ఇప్పుడు నాకు సినిమాయే లోకం అనిపిస్తోంది. నటిస్తున్న కొద్దీ విడదీయరాని బంధం ఏర్పడుతోంది. అందుకనీ ముందు నుంచీ ఉన్న నా ఇష్టా ఇష్టాలను వదిలేయలేను కదా? అన్నింటికీ సమ ప్రాధాన్యం ఇవ్వాలి. కష్టం, సుఖం, పని, వినోదం, విరామం.. ఇలా దేని ప్రాధాన్యం దానికి ఇస్తూ బ్యాలెన్స్‌గా ముందుకు సాగాలి. అప్పుడే మనస్సు హాయిగా ఉంటుంది’’ అంటోంది గ్లామర్ బ్యూటీ భవ్యశ్రీ. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకోవాలనుకుంటోంది. కెరీర్ టాలీవుడ్‌లో ప్రారంభమైనా, ఊపందుకుంది మాత్రం కోలీవుడ్‌లోనే. ప్రస్తుతం అక్కడ ఎన్నో చిత్రాల్లో వెరైటీ పాత్రలు పోషిస్తూ నటిగా మంచి మార్కుల్ని కొట్టేస్తోంది. టాలీవుడ్‌లో తేజ దర్శకత్వంలో వచ్చిన ‘వెయ్యి అబద్ధాలు’లో స్వాతిగా పరిచయమైన భవ్యశ్రీ అటు తర్వాత భక్తిరస చిత్రం ‘సతీ తిమ్మామాంబ’లో చక్కటి క్యారెక్టర్ ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించింది. తాజాగా ‘నేను సీతాదేవి’ చిత్రంలో దేవి-సీత అనే రెండు విభిన్నపాత్రలను చేసి అందరి చేత ప్రశంసలందుకుంది. ఇందులో సందీప్‌కు జోడీగా చేసిన ఈ క్యారెక్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అచ్చ తెలుగు అమ్మాయి అయిన భవ్యశ్రీకి కోలీవుడ్‌లో అనేక ఆఫర్లు తలుపుతడుతున్నాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ నటించిన చిత్రం ‘ఆరా’. తమిళ చిత్రసీమలో ఎన్ని అవకాశాలు వస్తున్నా తన టార్గెట్ మాత్రం టాలీవుడేనంటోంది. ఏ విషయంలోనైనా మొహమాట పడొచ్చు. కానీ తెలియంది నేర్చుకోవడానికి కాదు అంటోంది. ఏ రంగంలోనైనా ఎవరికీ అన్నీరావు. నేర్చుకుంటూనే వుండాలి. మనకు తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి. నేనూ అలాంటి అమ్మాయినే కదా. నాకు వీలైనంతలో కష్టపడి నాకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నా. ఎవరైనా నాకు తెలియని విషయమంటూ ఉండదు అనుకుంటే దానంత పొరపాటు మరొకటి ఉండదు. నాకురాని విషయం గురించి ఎవరు చెప్పినా వింటాను. నాకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఏదోలా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను’’అంటోంది. ప్రస్తుతం కోలీవుడ్‌లో నాలుగైదు చిత్రాల్లో ముఖ్య పాత్రలను పోషిస్తున్న భవ్యశ్రీ తెలుగులోనూ మరో రెండు చిత్రాల్లో నటించడానికి సిద్ధమయింది. అన్ని రకాల పాత్రలు చేసి నిరూపించుకోవాలన్నదే తన లక్ష్యంగా చెబుతోంది. టాలీవుడ్‌లో హుందాతనంతో కూడిన పాత్రలొస్తే తప్పకుండా గ్లామర్‌కు సై అంటోంది. ఓ నటిగా సంపాదించుకున్న స్టార్‌డమ్‌ని ప్రతిక్షణం ఆహ్యానించినప్పుడే ఆ నటికి పేరుకు పేరు. తెలుగు, తమిళం అంటూ వేరు చేయకుండా రెండు భాషల్లోనూ కమర్షియల్ చిత్రాల్లో నటిస్తూనే ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించాలనుంది. ముఖ్యంగా టాలీవుడ్‌పై ఎక్కువ గురిపెట్టి నాకంటూ ఓ పేరు సంపాదించుకోవాలన్నదే తన తపన అంటూ చెప్పుకొచ్చింది. వాహ్..్భవ్యశ్రీ ఆల్ ది బెస్ట్!