అనగనగా ఓ ప్రేమకథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

థౌజండ్ లైట్స్ మీడియా ప్రై. లి. పతాకంపై విరాజ్ జె.అశ్విన్, రిద్దికుమార్, రాధా బంగారు ప్రధాన తారాగణంగా టి.ప్రతాప్ దర్శకత్వంలో కె.ఎల్.ఎన్.రాజు రూపొందిస్తున్న ‘అనగనగా ఓ ప్రేమకథ’ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లో శనివారం ఉదయం జరిగింది. నిర్మాత కె.ఎల్.ఎన్.రాజు క్లాప్‌నివ్వగా, సత్య రంగయ్య కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- మంచి కథతో రూపొందిస్తున్న ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని తెలిపారు. ప్రేమకథలో వున్న వైవిధ్యాలు ప్రేక్షకులకు గిలిగింతలు పెడతాయని, హీరో హీరోయిన్లు కొత్తవారైనా బాగా నటించే సత్తా వున్నవారని, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలతో రూపొందే ఈ చిత్రం అందరికీ నచ్చుతుందన్న నమ్మకం వుందని నిర్మాత తెలిపారు. కార్యక్రమంలో కథానాయకుడు విరాజ్ జె అశ్విన్, కథానాయికలు రిద్దికుమార్, రాధా బంగారు, మార్తాండ్ కె.వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. కాశీ విశ్వనాధ్, అనీష్ కురువిల్లా, వేణు తిళ్ళు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎదురోలు రాజు, సంగీతం: కృష్ణచేతన్.టి.ఆర్, పాటలు: శ్రీమణి, నిర్మాత: కె.ఎల్.ఎన్.రాజు, దర్శకత్వం: ప్రతాప్.టి.