రీరికార్డింగ్‌లో 2 ఫ్రెండ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూరజ్, సానియా, స్నిగ్ధ ప్రధాన తారాగణంగా అనంత లక్ష్మి క్రియేషన్స్ పతాకంపై జి.ఎల్.బి.శ్రీనివాస్ దర్శకత్వంలో ముళ్ళగూరు అనంతరాముడు, రమేష్‌నాయుడు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘2 ఫ్రెండ్స్’. ఈ చిత్రానికి సంబంధించిన రీ రికార్డింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- తెలుగు రాష్ట్రాలతోపాటుగా కర్నాటకలో కూడా ఈ సినిమాను నాలుగు షెడ్యూల్స్‌లో చిత్రీకరించామని, బెంగళూరు, అనంతపురం, వరంగల్ ప్రాంతాల్లో షూటింగ్ చేశామని అన్నారు. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తిచేశామని, నేడు యువత ఎన్నో అద్భుతాలు సృష్టిస్తోందని, కాలేజీల్లోనే వారికి భవిష్యత్తు నిర్దేశకత్వం అవుతుందని, అయితే ప్రేమకంటే స్నేహం గొప్పదనే కథనంతో ఈ చిత్రం రూపొందించామని తెలిపారు. యువతరం పరిచయాన్ని ప్రేమగా భావిస్తోందని, ప్రేమ గొప్పదా? స్నేహం గొప్పదా? అన్న యువతకు ఈ చిత్రం కనువిప్పుగా సందేశమిస్తుందని వారు అన్నారు. కార్తిక్, సారా, ధన్‌రాజ్, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్‌రెడ్డి, వై.విజయ, శ్రీలక్ష్మి నటించిన ఈ చిత్రానికి కెమెరా:టి.సురేందర్‌రెడ్డి, కథ, మాటలు, సంగీతం:పోలూరు ఘటికాచలం, నిర్మాతలు: అనంతరాముడు, రమేష్‌నాయుడు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:జి.ఎల్.బి.శ్రీనివాస్.