రామునికై.. సీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శరత్, కారుణ్య జంటగా తస్మై చిన్మయ ప్రొడక్షన్స్ పతాకంపై అనీల్ గోపిరెడ్డి దర్శకత్వంలో శిల్పా శ్రీరంగం, సరితా గోపిరెడ్డి సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘సీత.. రాముడికోసం’. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేశారు. సినిమాకు సంబంధించిన టీజర్‌ను హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో స్వామి చిదాత్మానంద ఆవిష్కరించారు. ఫస్ట్‌లుక్‌ను జ్యోతి విడుదల చేశారు. ఈ సందర్భంగా చిదాత్మానంద స్వామి మాట్లాడుతూ- ముఖంలో భావాలు ప్రకటితమైతే అందంగా కనిపిస్తే అదో అద్భుతమైన సినిమాగా ఆవిష్కరిస్తుందని, అలాంటి ఈ సీత ఓ మంచి సినిమాగా ప్రేక్షకులను అలరిస్తుందని తెలిపారు. నా హృదయానికి దగ్గరైన కథతో ఈ చిత్రాన్ని రూపొందించానని, సినిమాలో ప్రధానంగా వున్న చిన్నపిల్లల పాత్రల కోసం రెండు నెలలపాటు వర్క్‌షాప్ నిర్వహించి వారికి నటనలో తర్ఫీదు ఇచ్చామని దర్శకుడు అనీల్ గోపిరెడ్డి అన్నారు. ఇప్పటికీ ఈ సినిమా చూసినవాళ్ళందరూ మెచ్చుకున్నారని, త్వరలో ఆడియోను, ట్రైలర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని ఆయన అన్నారు. మంచి సిట్యుయేషన్ ఉండడంతో అందరికీ నచ్చే గీతాలు వచ్చాయని రచయిత వెంగి తెలిపారు. టీజర్‌ను చూసినవారు మెచ్చుకున్నారని, త్వరలో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని హీరో శరత్ తెలిపారు. ఓ స్ర్తి మగవాడిని బ్రతికి వున్నపుడు ఎంత ప్రేమిస్తే చనిపోయాక కూడా ఎలా ప్రేమిస్తుందో అన్న కథనంతో ఈ చిత్రం సాగుతుందని మాటల రచయిత వేణు రాచర్ల తెలిపారు.
కార్యక్రమంలో సాయి తలారి, కారుణ్య, మధూ రెబ్బ తదితరులు పాల్గొని విశేషాలు తెలిపారు. తా.రమేష్, బాల, అను తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:జైపాల్‌రెడ్డి.ఎన్, మాటలు:వేణు రాచర్ల, పాటలు:వెంగి, భాస్కరభట్ల, అనీల్ గోపిరెడ్డి, రచన, సంగీతం, దర్శకత్వం:అనీల్ గోపిరెడ్డి.