సరికొత్త గుర్తింపుతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతంలో ఆవారా, ఊపిరి చిత్రాలతో ఎంత గుర్తింపు వచ్చిందో ఖాకి సినిమాతో మరింత గుర్తింపు వచ్చింది. అందరూ అప్రీసియేట్ చేశారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ చూసి ప్రేక్షకులు థ్రిల్‌కు గురి అవుతున్నారని కథానాయకుడు కార్తి తెలిపారు. ఆదిత్య మ్యూజిక్ నిర్మాణ సంస్థ తొలిసారిగా తెలుగులో విడుదల చేసిన ఖాకి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన విజయోత్సవ వేడుక శనివారం ఉదయం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా పలు విశేషాలు తెలిపిన కార్తి మాట్లాడుతూ- వినోద్ స్క్రీన్‌ప్లే సినిమాలో హైలెట్‌గా వుందని, సంగీతం, కెమెరాతో సహా అన్ని డిపార్టుమెంట్‌లు చక్కగా పనిచేయడంతో మంచి ఔట్‌పుట్ వచ్చిందని తెలిపారు. పోలీసులపై మంచి అభిప్రాయం ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు కలుగుతుందని, అందుకే సినిమాను పోలీసు డిపార్ట్‌మెంట్‌కు అంకితం చేశామని తెలిపారు. తెలుగులో అత్యధిక థియేటర్‌లలో విడుదలైన తన సినిమా ఇదేనని, పోలీసు డిపార్ట్‌మెంట్‌వారు కూడా ఈ చిత్రం చూడబోతున్నారని ఆయన తెలిపారు. ఇంటిలిజెంట్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో రకుల్ పాత్ర డిఫరెంట్‌గా సాగిందని ఆయన వివరించారు. రెండవ వారం ప్రారంభమైనా కలెక్షన్లు స్టడీగా ఉన్నాయని శ్రీ్ధర్ రెడ్డి తెలిపారు. తమిళం, తెలుగు భాషలలో విడుదలైన ఖాకి చిత్రాన్ని ప్రేక్షకులు అద్భుతంగా ఆదరిస్తున్నారని, మంచి కథలు విజయం సాధిస్తాయని ఖాకి నిరూపించిందని కథానాయిక రకుల్‌ప్రీత్‌సింగ్ తెలిపారు. కార్యక్రమంలో నిర్మాతలు, సినిమా యూనిట్ పాల్గొని విశేషాలు తెలిపారు.