టార్చిలైట్ మొదలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్య శ్రీనివాస్, ఆశే్లష, ప్రియాంక ప్రధాన తారాగణంగా చంద్రకళా ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై వరప్రసాద్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘టార్చిలైట్’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్ ఫిలింనగర్ దైవ సన్నిధానంలో శనివారం ఉదయం జరిగింది. శివాజీరాజా క్లాప్‌నివ్వగా, డి.వి. కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు వరప్రసాద్ మాట్లాడుతూ- మెయిన్ విలన్‌గా రవిబాబు నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ డిసెంబర్ 2వ వారం నుండి ప్రారంభం కానున్నదని, వైజాగ్, హైదరాబాద్, శ్రీకాకుళం తదితర ప్రాంతాలలో సింగిల్ షెడ్యూల్‌లో సినిమా పూర్తిచేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. హారర్ జోనర్‌లో రూపొందించే ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని కథానాయకుడు సూర్య శ్రీనివాస్ తెలిపారు. ఐదు పాటలలో మెలోడీ సాంగ్స్, ఐటెం పాట, బీట్ సాంగ్స్ ఆకట్టుకుంటాయని ఆయన అన్నారు. కార్యక్రమంలో సంగీత దర్శకుడు దేవేంద్ర, కథానాయికలు ఆశే్లష, ప్రియాంక విశేషాలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా:ఇ.ఎస్.హెచ్.ప్రసాద్, మాటలు:సుబ్బారాయుడు, ఎడిటింగ్:వి.నాగిరెడ్డి, నిర్మాతలు:మనోజ్ సాయి శ్రీరామ్, శ్రీరామ్ అజయ్, సాయిలక్ష్మి, మంగునూరు ఆంజనేయులు, ముద్దం రామచంద్రుడు, వాణిచౌదరి, దర్శకత్వం:వరప్రసాద్.