బాబీ దర్శకత్వంలో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యంగ్ టైగర్ ఎన్‌టిఆర్ కెరీర్‌లో బిగ్గెస్ట్ మూవీగా ఇమేజ్ తెచ్చుకున్న సినిమా ‘జై లవకుశ’. ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు బాబీ తదుపరి సినిమాకు సన్నాహాలు మొదలుపెట్టాడు. జై లవకుశ తరువాత బాబీకి జోరుగా అవకాశాలు వస్తున్నాయి. అయితే ఆయన తాజాగా మెగా హీరోతో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. నిజానికి రవితేజ కోసం కథను సిద్ధం చేశాడట. కానీ రవితేజ వేరే సినిమాలతో బిజీగా ఉండడంతో బాబీ మరో హీరోతో ప్లాన్ చేస్తున్నాడు. ఆయన నెక్స్ట్ సినిమా ఎవరితో తెలుసా.. మెగా మేనల్లుడు ధరమ్‌తో? తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాబీ మాట్లాడుతూ ఒకానొక సమయంలో తాను చాలా నిరాశలో ఉన్నానని, ఆ సమయంలో సాయిధరమ్ ఎంతో సపోర్టు అందించాడని, అప్పటినుండి మామధ్య మంచి స్నేహం కుదిరిందని చెప్పాడు. తాజాగా తేజుతో ఓ సినిమా చేస్తానని అంటున్నాడు బాబీ. అదీ విషయం.