‘ఓటర్’ ఫస్ట్‌లుక్‌కు విశేష స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరో విష్ణు మంచు జన్మదినం సందర్భంగా విడుదలైన ‘ఓటర్’ ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు విశేష స్పందన వస్తోంది. ప్రముఖ కేంద్ర, రాష్ట్ర రాజకీయ నాయకుల ముఖ చిత్రాలతో నిండి, ఓటర్‌గా విష్ణు తన వేలును చూపిస్తున్నట్లున్న ‘ఓటర్’ ఫస్ట్‌లుక్ పోస్టర్ చాలా పవర్‌ఫుల్‌గా ఉందని ప్రశంసిస్తున్నారు. రామా రీల్స్ పతాకంపై జాన్ సుధీర్ కుమార్ పూదోట నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ జి.ఎస్.కార్తీక్ దర్శకత్వంలో పూర్తికావస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంగా బైలింగ్వల్‌గా రూపొందుతున్న ‘ఓటర్’ చిత్రంతో విష్ణు తమిళ తెరకు పరిచయం కాబోతున్నారు. తమిళంలో ‘కురళ్ 388’అనే పేరుతో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు నిర్మాతలు. ప్రజాస్వామ్యంలో అత్యంతక కీలకమైన పాత్ర ఓటర్‌దే. కానీ అటువంటి ఓటర్ ఎన్నికల తర్వాత నిర్లక్ష్యానికి గురవుతున్నాడు. ఓటర్ పవర్ ఏంటో చూపించే చిత్రం ఇది. కామన్ పాయింట్ కావడంతో తమిళంలో కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాం.