‘ప్రేమదేశం’ లోగో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీమారుతీ ఆర్ట్ క్రియేషన్స్, సిరి క్రియేషన్స్ పతాకంపై సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘ప్రేమదేశం’. శ్రీకాంత్ సిద్ధం దర్శకత్వంలో స్రవంతి శ్రీ్ధర్ రూపొందిస్తున్నారు. అర్జున్ కళ్యాణ్, మోహన్, శివరామచంద్రన్, అక్షయ, రవళి, వైశాకి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుండి ప్రారంభం కానున్నది. వేసవి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమాకు సంబంధించి లోగోను హైదరాబాద్‌లో దర్శకుడు బాబి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ప్రేమదేశం’ అనగానే టీనేజ్ రోజులు గుర్తుకు వచ్చాయని టీజర్ చాలా బాగా ఉందని, అంతా కొత్తవాళ్లే అయినా బాగా నటించారని, పెద్ద విజయం సాధించాలని కోరుకున్నారు. చిన్న సినిమాల్లో పెద్ద సినిమాగా రూపొందిన ఈ చిత్రంలో నటీనటులందరూ బాగా నటించారని, ‘పెళ్ళిచూపులు’ సినిమా తర్వాత అంతగా బాగా ప్రేక్షకులకు నచ్చుతుందని నిర్మాత తెలిపారు. హైపర్ లింక్డ్ స్క్రీన్‌ప్లేతో తెరకెక్కనున్న ఈ సినిమాలో మూడు కథలు ప్రేక్షకులకు నచ్చుతాయని, హైదరాబాద్ నేపథ్యంలో జరిగిన ఓ ప్రమాదం సంఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందిస్తున్నామని, మిగతా వివరాలు త్వరలో తెలుపుతామని దర్శకుడు శ్రీకాంత్ సిద్ధం అన్నారు.