శర్వా, కాజల్, నిత్యాల కాంబినేషన్‌లో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ కథానాయకుడు శర్వానంద్, కాజల్, నిత్యామీనన్‌ల కాంబినేషన్‌లో ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో ప్రముఖ చలనచిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న నూతన చిత్రం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోల ప్రారంభమైంది. కథానాయకుడు శర్వానంద్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ కథానాయకుడు నాగచైతన్య క్లాప్‌నివ్వగా, కెమెరా స్విచ్‌ఆన్ ప్రముఖ దర్శకుడు మారుతి చేశారు. చిత్రం స్క్రిప్ట్‌ను హారిక అండ్ హాసిని సంస్థ అధినేత ఎస్.రాధాకృష్ణ చిత్ర దర్శక నిర్మాతలకు అందజేశారు. ప్రముక నిర్మాతలు బి.వి.ఎస్.ప్రసాద్, జెమిని కిరణ్, దర్శకుడు అనిల్‌రావిపూడి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. డిసెంబర్‌లో చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం:ప్రశాంత్ పిళ్లై, కెమెరా:దివాకర్ మణి, నిర్మాత: సూర్యదేవర నాగవంశీ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:సుధీర్ వర్మ.