సస్పెన్స్ థ్రిల్లర్‌తో రచయిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుహర మూవీస్ సమర్పించు చిత్రం ‘రచయిత’. ఈ చిత్రం ఆడియో విడుదల హైదరాబాద్ మణికొండలో పాటల రచయిత చంద్రబోస్ నివాసంలో నటుడు జగపతిబాబు సమక్షంలో ఆడియో విడుదల జరిగింది. అనంతరం జగపతిబాబు మాట్లాడుతూ- నాకు రచయితలంటే చాలా గౌరవం. ‘రచయిత’ అనే సినిమా సస్పెన్స్ థ్రిల్లర్‌తో తెరకెక్కనుంది. ఈ సినిమా కానె్సప్ట్ నాకు విపరీతంగా నచ్చడంతో మొదట నేనే నటించాలనుకున్నా. కానీ నా డేట్స్ కుదరకపోవడంతో చేయలేదు. ఈ చిత్ర దర్శకుడు నా మిత్రుడు. తను మంచి సినిమా తీసాడన్న ఉద్దేశ్యంతోనే చిన్న సినిమా బ్రతకాలనే తపనతోనే నా ఫేస్‌బుక్ ద్వారా ఈ పాటలను విడుదల చేయడం జరుగుతోంది. అంతేకాదు ఈ సినిమా కోసం నేను వైజాగ్, విజయవాడ, హైదరాబాద్‌లలో పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నాను.
అన్ని సినిమాలకు ఆడియో వేడుక సాధారణంగా జరుగుతుంది కానీ ఈ చిత్ర టైటిల్ ‘రచయిత’ కనుక ఈ చిత్రానికి పాటలు రచించిన చంద్రబోస్ ఏ సీట్‌లో అయితే ఈ సినిమా పాటలు పుట్టించాడో అదే సీట్‌లో విడుదల చేయాలని నిర్ణయించుకొని చంద్రబోస్ నివాసంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. రచయిత సినిమాకు ప్రీ రిలీజ్ వేడుక చేయకుండా డైరెక్టుగా పబ్లిక్‌కు చేరేలా డిసెంబర్ 8న ఒక థియేటర్‌లో సినిమా ప్రదర్శింపచేసి నేనే స్వయంగా థియేటర్ బయట మైక్ పట్టుకొని నిల్చుని ప్రేక్షకుల రివ్యూ తెలుసుకోబోతున్నా. ఇదంతా నా మిత్రుడు సాగర్ చేసిన మంచి ప్రయత్నం కోసమే అన్నారు. ఇప్పుడు విడుదలైన మూడు పాటల్లో నాకు ‘ఏ ఎదలో ఏముంటుందో’ అనే పాట బాగా నచ్చింది అన్నారు. చంద్రబోస్ మాట్లాడుతూ- చిన్న సినిమాను బ్రతికించాలనే తపనతోనే హీరో, నటుడు జగపతిబాబు తన సహాయ సహకారాలు అందజేస్తున్నారన్నారు. ఈ చిత్రంలో మూడు పాటలున్నాయి. మూడు కూడా సందర్భానుసారంగా ఉంటాయి అన్నారు. ఈ గీతాలకు సంగీతం అందించింది శ్యామ్ మలయాళ సంగీత దర్శకుడు అన్నారు.