ద్విపాత్రాభినయం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బిచ్చగాడు’ సినిమా తెలుగులో ఎంత పెద్ద సంచలన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాతో స్టార్‌గా మారిపోయాడు హీరో విజయ్ ఆంటోని. భిన్నమైన సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ ఆంటోని నటిస్తున్న తాజా చిత్రం ఇంద్రసేన. తమిళంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో ఈనెల 30న విడుదల కానుంది. శ్రీనివాసన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా గురించి హీరో విజయ్ చెప్పిన విశేషాలు..
ఎమోషన్స్ ప్రధానంగా..
అన్నాతమ్ముళ్ళ గురించి తెరకెక్కిందే ఈ సినిమా. వారిమధ్య ఎమోషన్స్ ఎలా ఉన్నాయి అన్న ప్రధాన అంశంతో రూపొందించాం. నిజ జీవితంలో జరిగిన సంఘటనలు ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించడం జరిగింది. నా కెరీర్‌లో మొదటిసారి ద్విపాత్రాభినయం చేస్తున్నాను. సినిమా బాగా వచ్చింది. తప్పకుండా మీ అందిరకీ నచ్చుతుంది.
కమర్షియల్ సినిమాలు
ఒక సినిమా జనాలందరికీ నచ్చి పెద్ద హిట్ అయితే అదే కమర్షియల్ సినిమా. నా సినిమాలు అన్ని కమర్షియల్‌గా బాగా ఆడాయి. కమర్షియల్ సినిమా అని సపరేట్‌గా ఉండదు. కొన్ని సినిమాల్లో కథలను బట్టి కథనం సాగుతుంది. ఈ సినిమా కూడా మంచి కానె్సప్ట్‌తో కమర్షియల్ వేలో తెరకెక్కించాం.
కంఫర్ట్ కోసమే..
నా బ్యానర్‌లోనే సినిమాలు నిర్మించడానికి కంఫర్ట్‌గా ఫీల్ అవుతాను. బయటి నిర్మాతలయితే వత్తిడి ఉంటుందని నా ఆలోచన. పైగా మనం అనుకున్నది తప్పకుండా స్క్రీన్‌పై వచ్చేందుకు ప్రయత్నిస్తా. బయటి ప్రొడ్యూసర్ అయితే చాలా కారణాలుంటాయి. ఇక నటనతోపాటు నాకు నిర్మాతగా, ఎడిటర్, మ్యూజిక్ కంపోజర్‌గా అన్ని శాఖల్లో పనిచేయడం ఇష్టం. ఇష్టమైన పనిని కష్టపడి చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతాం.
దర్శకత్వం చేయను..
నేను యాక్టర్‌గానే కొనసాగుతా. దర్శకులు మంచి స్క్రిప్ట్‌తో వస్తున్నారు. యాక్టింగ్ అంటేనే ఇష్టం. నిర్మాణంపైన శ్రద్ధ వహిస్తున్నాను. మ్యూజిక్ కూడా చేస్తున్నాను. డైరెక్టర్ అవ్వాలనే ఆలోచన ఇప్పట్లో లేదు. ఇక తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేయాలనే చూస్తున్నాను. దాన్ని తమిళ్‌లో డబ్ చేస్తా.. ప్రస్తుతం తెలుగులో కథలు వింటున్నాను. త్వరలో చెయ్యబోతున్నాను. ప్రస్తుతం తమిళ్‌లో రెండు సినిమాలు చేస్తున్నాను. అందులో ఒకటి కాళీ.. దాంతోపాటు మరో సినిమా ఉంటుంది.