రెగ్యులర్ షూటింగ్‌లో ‘నేనే సరోజ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడు అల్లాణి శ్రీ్ధర్ ఎస్3 క్రియేషన్స్, ఫిల్మ్ ఇండియా ప్రొడక్షన్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రం ‘నేనే సరోజ’. ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఉప్పల్ రామాలయంలో ప్రారంభమైంది. రామయ్య నాయుడు, వరంగల్ సుధాకర్ పాల్గొన్న కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సందర్భంగా అల్లాణి శ్రీ్ధర్ మాట్లాడుతూ- పల్లెటూరిలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన ఓ ఆడపిల్ల తన వాళ్ల చదువుకోసం పట్నానికి వచ్చి ఎలాంటి సవాళ్లు ఎదుర్కొని తనను తాను నిరూపించుకున్నది అన్న కథనంతో ఈ చిత్రం రూపొందిస్తున్నామని తెలిపారు. కన్నవాళ్లకు దూరమై పట్టణానికి వచ్చి హాస్టల్స్‌లో వుంటూ కాలేజీలో చదువుకునే కోట్లాదిమంది ఆడపిల్లలకు ప్రతీకగా ఈ సినిమా హీరోయిన్ పాత్ర వుంటుందని, తెలంగాణ నేపథ్యం యాస, భాసతో రూపొందుతున్న ఈ సినిమా సంస్కృతీ జీవన విధానాలను చిత్రిస్తుందని ఆయన అన్నారు. మేఘన ముదుమల కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీహర్ష, బొమ్మలాట సారిక, వింజమూరి మధు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: రమేష్ ముక్కెర, కెమెరా: ధన జి.బాబు, పాటలు: సుద్దాల అశోక్‌తేజ, సదానంద్ శారద, వీరేంద్ర కాపర్తి, కథ, మాటలు: సదానంద్ శారద, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అల్లాణి శ్రీ్ధర్.